: సిద్ధార్థ్ మల్హోత్రాతో ఎఫైర్ వార్తలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్
బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో తనకు ఎఫైర్ నడుస్తోందని వస్తోన్న వార్తలపై శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పందించింది. బాలీవుడ్‌లో ఇప్పుడు ఈ అంశమే హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సాధారణంగా అభిమానులు కొందరు నటీనటుల గురించి తమకి నచ్చినట్లుగా ఊహించుకుంటారని ఆమె చెప్పింది. తాము ఎవరి ప్రేమలోనో పడ్డట్లు వారు భావిస్తారని ఆమె పేర్కొంది. ప్రధానంగా పెళ్లి కాని నటులపై, ఒంటరిగా ఉన్న నటులపై రూమర్లు వస్తాయని ఆమె చెప్పింది. ఇప్పటికీ తాను ఒంటరిగానే ఉంటున్నాను కాబట్టే తనను కొందరు టార్గెట్ చేశారని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను అలాంటి పుకార్లపై సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆమె చెప్పింది. కాగా, గతంలోనూ ఈ భామపై ఇటువంటి పుకార్లే వచ్చాయి. అర్జున్ కపూర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రేమలో పడిందని అప్పుడు పుకార్లు షికార్లు చేశాయి. అయితే, అప్పుడు కూడా ఈ భామ ఇప్పుడు స్పందించిన విధంగానే స్పందించింది.