: రాజ్యసభను కుదిపేస్తున్న కేవీపీ బిల్లు!... ‘హోదా’ బిల్లుపై చర్చకు కాంగ్రెస్ పట్టు!


ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు రాజ్యసభను కుదిపేస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రైవేటు బిల్లులు ఉన్నప్పటికీ ఒక్క కేవీపీ బిల్లు మాత్రమే రాజ్యసభలో చర్చనీయాంశంగా మారింది. గత శుక్రవారం ఈ బిల్లుపై ఓటింగ్ జరగాల్సి ఉన్నా... బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఓటింగ్ ను వాయిదా వేయించింది. అంతటితో ఆ బిల్లు గొడవ సద్దుమణిగిందనే బీజేపీ తలచింది. అయితే అందుకు విరుద్ధంగా బీజేపీ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేటి ఉదయం ప్రారంభమైన సమావేశంలో ఆందోళనకు దిగింది. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే కేవీపీ బిల్లుపై ఓటింగ్ ను వాయిదా వేసేలా చేసిందని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ... తక్షణమే బిల్లుపై చర్చకు అనుమతించాలని డిప్యూటీ చైర్మన్ కురియన్ ను కోరారు. అయితే సభలో కాంగ్రెస్ వాదనను తిప్పికొట్టేందుకు బీజేపీ యత్నించింది. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది.

  • Loading...

More Telugu News