: బాలుడిని తొక్కేసిన స్కూల్ బస్సు!... ఆగ్రహంతో బస్సును ధ్వంసం చేసిన గ్రామస్తులు!


నల్లగొండ జిల్లాలో నేటి ఉదయం దారుణం చోటుచేసుకుంది. ఇంటి ముందు కులాసాగా ఆడుకుంటున్న ఓ చిన్నారి బాలుడిని స్కూల్ బస్సు చిదిమేసింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు బస్సును ధ్వంసం చేశారు. వివరాల్లోకెళితే... నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం నాగాయిపల్లితండా నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్లేందుకు ఓ స్కూల్ బస్సు వచ్చింది. రోడ్డుపై తన ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి బాలుడిపైకి సదరు బస్సు టైర్లు ఎక్కేశాయి. దీంతో బస్సు చక్రాల కింద నలిగిన బాలుడు చనిపోగా... షాక్ తిన్న డ్రైవర్ బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు. బాలుడి మృతితో ఆగ్రహవేశాలకు గురైన గ్రామస్తులు బస్సును ధ్వంసం చేశారు. బాలుడి మృతి, బస్సు ధ్వంసం నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News