: తండ్రి భాగోతాన్ని బయటపెట్టిన యూపీ బాలిక!


ప్రముఖ జాతీయ పత్రిక ‘దైనిక్ భాస్కర్’ ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి గురించి నేటి తన సంచికలో ఆసక్తికర కథనాన్ని రాసింది. గుట్టుచప్పుడు కాకుండా సదరు వ్యక్తి నెరపుతున్న ఘనకార్యాన్ని స్వయానా అతడి కూతురు బయటపెట్టిందంటూ ఆ పత్రిక రాసిన కథనం ఆసక్తికరంగా సాగింది. వివరాల్లోకెళితే... ఉత్తరప్రదేశ్ లోని బరేలీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 140 మంది మహిళలతో వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నాడు. తాను సరసాలాడుతున్న మహిళల పేర్లు, వారితో ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ కలిసిన వివరాలన్నింటినీ అతడు ఓ డైరీలో రాసుకున్నాడు. సదరు డైరీని అతడు భద్రంగా తన ఇంటిలోని ఓ ట్రంకు పెట్టెలో దాచుకున్నాడు. ఈ డైరీని చూసిన అతడి కూతురు తండ్రి వెలగబెడుతున్న రాచకార్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాలిక చెప్పిన వివరాలు విన్న పోలీసులు తొలుత షాక్ తిన్నా... ఆ తర్వాత ఆ ప్రబుద్ధుడిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే... సదరు వ్యక్తి సరసాలు నెరపుతున్న మహిళల్లో యూపీకి చెందిన ఓ మహిళా పోలీసు అధికారి కూడా ఉన్నారట. ఈ మేరకు వివరాలు మాత్రమే వెల్లడించిన సదరు పత్రిక కథనం... కేసు ఏ పోలీస్ స్టేషన్ లో నమోదైంది, సదరు వ్యక్తి వివరాలేమిటి అన్న విషయాల జోలికి వెళ్లలేదు.

  • Loading...

More Telugu News