: 'కబాలి' బ్యాక్... చెన్నైలో ప్రత్యక్షమైన రజనీకాంత్!
దాదాపు రెండు నెలల క్రితం విశ్రాంతి పేరిట అమెరికాకు వెళ్లిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఇండియాకు తిరిగి వచ్చారు. అమెరికాలో అనారోగ్యానికి గురికావడంతో అక్కడే చికిత్స చేయించుకున్న ఆయన, నిన్న చెన్నై చేరుకోగా, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వాస్తవానికి రజనీకాంత్, తన నూతన చిత్రం విడుదలకు ముందుగా, 3వ తేదీన రావాల్సి వుండగా, ఆయన రాలేకపోయారు. ఈ నేపథ్యంలోనే కబాలి చిత్రం విడుదల కూడా వాయిదా పడింది. గతవారంలో కబాలి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను తాకిన సంగతి తెలిసిందే. ఇక రజనీ రాకను గురించి తెలుసుకున్న అభిమానుల సందడితో చెన్నై ఎయిర్ పోర్టు కళకళలాడింది. ఆయన సైతం తనదైన చిరునవ్వుతో అభిమానులను పలకరించారు.