: జర్మనీలో మరో ఉగ్రదాడి!... ఆన్స్ బాక్ బార్ లో సూసైడ్ అటాక్!


వరుస ఉగ్రవాద దాడులతో జర్మనీ బెంబేలెత్తిపోతోంది. గడచిన పది రోజుల వ్యవధిలోనే మూడు దాడులు చోటుచేసుకోవడంతో ఆ దేశ ప్రజలు భయకంపితులవుతున్నారు. ఇప్పటికే రెండు దాడులు జరగగా... తాజాగా నిన్న జర్మనీలోని వాన్స్ బాక్ నగరంలో మరో ఉగ్రవాది విరుచుకుపడ్డాడు. నగరంలోని ఓ బార్ సమీపంలోకి చొచ్చుకువచ్చిన ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది గాయాలపాలయ్యారు. బార్ లో జరుగుతున్న సంగీత విభావరి టార్గెట్ గానే సదరు ఆత్మాహుతి దళ సభ్యుడు దాడికి దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News