: విశాఖలో జగన్ ‘పరామర్శ’ యాత్ర!... ఎయిర్ ఫోర్స్ విమాన బాధిత కుటుంబాలకు పరామర్శ!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖ పర్యటనకు వెళుతున్నారు. నాలుగు రోజుల క్రితం చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ కు బయలుదేరిన ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతైన విషయం తెలిసిందే. ఈ విమానంలోని మొత్తం 29 మందిలో 8 మంది విశాఖ వాసులున్నారు. నాలుగు రోజులవుతున్నా... విమానం ఆచూకీ తెలియలేదు. ఈ నేపథ్యంలో విమానంలోని తమ వారు ఏమయ్యారోనన్న వేదనలో విశాఖలోని బాధిత కుటుంబాలు కూరుకుపోయాయి. వీరిని పరామర్శించేందుకే జగన్ నేడు విశాఖకు వెళుతున్నారు.