: రోడ్డెక్కిన జగ్గారెడ్డి!... సంగారెడ్డి డిపోలోనే నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు!


మెదక్ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిన్న జరిగిన ఆందోళనపై పోలీసుల లాఠీచార్జీపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల కఠిన వైఖరి, జనంపై కేసీఆర్ సర్కారు ఉక్కుపాదాన్ని నిరసిస్తూ టీ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో నేడు తెల్లవారకముందే రోడ్డుపైకి వచ్చారు. సంగారెడ్డిలోని ఆర్టీసీ డిపో ముందు ఆయన రోడ్డుపైనే బైఠాయించారు. భారీ అనుచరగణంతో కదిలివచ్చిన జగ్గారెడ్డి నిరసనకు దిగడంతో సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ఆర్టీసీ డిపో నుంచి సింగిల్ బస్సు కూడా బయటకు రాలేదు.

  • Loading...

More Telugu News