: నేపాల్ ప్రధాని కేపీ ఓలీ రాజీనామా


అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవడానికి ముందే నేపాల్ ప్రధాని కేపీ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఓలీ మాట్లాడుతూ, భారత్, చైనాలతో సత్సంబంధాలు మెరుగు పరిచేలా కృషి చేసినందుకే నేపాలీ కాంగ్రెస్, మావోయిస్టులు తన ప్రభుత్వంపై కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. కాగా, అక్టోబర్ 2015లో కేపీ ఓలీ నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. సీపీఎన్-మావోయిస్టు సెంటర్, నేపాల్ కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి. కీలక మద్దతుదారులైన మాదేసి పీపుల్స్ రైట్స్ ఫోరమ్-డెమోక్రాటిక్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీలు అవిశ్వాస తీర్మానికి మద్దతు ప్రకటించడంతో ఓలీ రాజీనామా చేయక తప్పలేదు.

  • Loading...

More Telugu News