: శృంగారాల జోలికి పోను.. సింగారాలు మాత్రం చేస్తాను: వివేకా
శృంగారాల జోలికి తాను పోనని, సింగారాలు మాత్రం తాను చేస్తానని టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి అన్నారు. తమ జిల్లాలో ఎంత మంది నాయకుల్లో శృంగార పురుషులు ఉన్నారో తనకైతే తెలియదని, తాను మాత్రం సింగార పురుషుడనని చెప్పారు. తనకు మిగిలిపోయిన కొన్ని కోరికలు ఉన్నాయని... ఆ కోరికలేమిటంటే జనంతో ఉండటం, వారితో తన జీవితం కొనసాగించడమేనని, ‘ఇట్స్ మై లాస్ట్ డిజైర్’ అని అన్నారు. నెల్లూరులో ఉంటే తాను రోజూ సినిమాకు వెళతానని, అయితే, ఒక్కడినే వెళతానని, తనతో పాటు నలుగురిని తీసుకువెళితే సినిమా చూడానివ్వకుండా ఏవో కబుర్లు చెబుతుంటారని, అందుకే, ఒక్కడినే వెళతానని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆనం జవాబిచ్చారు.