: కర్ణాటకలో మెరిసిన చిరంజీవి
కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తెలుగు వారి సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటుంది. మే 5న విధాన సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వారి ఓట్లను కాంగ్రెస్ వైపు ఆకర్షించేందుకు సినీ నటుడు, కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి కర్ణాటకలో వాలిపోయారు. పావనగడ నియోజకవర్గంలో చిరంజీవి ప్రచారం చేస్తూ.. ఓటర్లను ఆకర్షిస్తున్నారు. చిరంజీవితోపాటు రాష్ట్ర మంత్రులు రఘువీరా, గంటా శ్రీనివాస్ కూడా అక్కడి కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు.