: రాజకీయాల్లో కఠినత్వం.. వ్యక్తిగతంగా సున్నితత్వం నా సొంతం: ఆనం వివేకా
రాజకీయాల్లో ఎంత కఠినంగా ఉంటానో, వ్యక్తిగతంగా అంత సున్నిత మనస్తత్వం తనదని టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ సున్నితత్వం మహిళలకే ఉంటుంది తప్పా, వేరొకరికి ఉండదని అన్నారు. రెండు రకాల ఆలోచనలు చేసేవాడిని స్ప్లిట్ మైండెండ్ అంటారని సైకాలజీలో చెబుతారని, తనకు స్ప్లిట్ మైండ్ నెస్ ఉందని, దానికి తాను ఒప్పుకుంటానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆడవాళ్లను ఆకర్షించాల్సిన అవసరం తనకు లేదని, వాళ్లే తనను గెలిపించారని మరో ప్రశ్నకు వివేకా తన దైనశైలిలో జవాబిచ్చారు.