: కంచె ఐలయ్య తన పద్ధతిని మార్చుకోకపోతే భౌతిక దాడులకు దిగుతాం: బ్రాహ్మణ సంఘం
బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్న సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య తన పద్ధతిని మార్చుకోకపోతే భౌతిక దాడులకు దిగుతామని అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ హెచ్చరించారు. ఎప్పుడో జరిగిపోయిన తప్పులను ఇప్పుడు ఎత్తి చూపడం సబబు కాదని, పద్ధతి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. తిని కూర్చునే సోమరులు బ్రాహ్మణులంటూ కంచె ఐలయ్య గతంలో చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఐలయ్య క్షమాపణలు చెప్పిన విషయం విదితమే. బ్రాహ్మణిజానికి మాత్రమే తాను వ్యతిరేకమని, బ్రాహ్మణులకు కాదని నాడు ఆయన పేర్కొన్నారు.