: పోలీసులూ! లాఠీఛార్జి, ఫైరింగ్ కు దూరంగా ఉండండి: హరీష్ రావు

మెదక్ జిల్లాలోని మల్లన్నసాగర్ ముంపు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని తెలంగాణ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. పోలీసులు, బాధితులు సంయమనం పాటించాలని ఈ సందర్బంగా ఆయన విజ్ఞప్తి చేశారు. పోలీసులు లాఠీ ఛార్జి, ఫైరింగ్ లకు పాల్పడవద్దని, విపక్షాల కుట్రలో ప్రజలు భాగస్వామ్యం కావొద్దని అన్నారు. మల్లన్న సాగర్ సమస్య ముగిస్తే విపక్షాలకు పని ఉండదని, అందుకే, విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని హరీష్ రావు మండిపడ్డారు.