: తేనెటీగల కలకలం... న్యూజిలాండ్, జింబాబ్వే మ్యాచ్ కు ఆటంకం


తేనెటీగల కారణంగా హరారే వేదికగా న్యూజిలాండ్, జింబాబ్వే-ఏ జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ టెస్టు మ్యాచ్ కొంచెం సేపు నిలిచిపోయింది. మైదానంలోకి తేనెటీగలు ఒక్కసారిగా రావడంతో మ్యాచ్ కు కొంచెం సేపు ఆటంకం కల్గింది. తేనెటీగల బారి నుంచి తప్పించుకునేందుకు న్యూజిలాండ్ ఫీల్డర్లు, జింబాబ్వే బ్యాట్ మన్ నేలపై బోర్లా పడుకున్నారు. మైదానంలోని సైడ్ స్క్రీన్ కు సమీపంలో తేనెటీగలు రావడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. అవి వెళ్లిపోయిన తర్వాత తిరిగి మ్యాచ్ ప్రారంభమైంది.

  • Loading...

More Telugu News