: పోలీసుల లాఠీఛార్జిలో తెలంగాణ తెలుగు రైతు అధ్యక్షుడికి గాయాలు


మెదక్ జిల్లాలోని మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. కొండపాక మండలం ఎర్రవల్లిలో పోలీసులు, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జాతీయరహదారిపై రాస్తారోకో చేసేందుకు వెళుతున్న ప్రజలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎర్రవల్లి గ్రామస్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో, వారిని చెదర గొట్టేందుకని పోలీసులు లాఠీఛార్జి చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసుల లాఠిఛార్జిలో తెలంగాణ తెలుగు రైతు అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాజు, సీపీఎం నేత భాస్కర్ సహా 20 మంది వరకు గాయపడ్డారు.

  • Loading...

More Telugu News