: వేముల ఘాట్ లో ఉద్రిక్తత... గ్రామస్తుల అరెస్టు


మెదక్ జిల్లాలోని మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన వేముల ఘాట్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజీవ్ రహదారిపై ధర్నాకు వెళ్తున్న వేములఘాట్ గ్రామస్తులను పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గ్రామస్తులపై పోలీసులు లాఠీఛార్జి చేసి వారిని మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న వేములఘాట్ గ్రామ యువకులు, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. కాగా, 2013 చట్టం ప్రకారమే నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ 50 రోజులుగా ముంపు గ్రామాలకు చెందిన గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో రాజీవ్ రహదారి ముట్టడికి వారు బయలుదేరడంతో, ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు.

  • Loading...

More Telugu News