: ఈ సినిమాలో స్వీట్, ఇన్నోసెంట్ గర్ల్ గా నటించా: హీరోయిన్ మన్నార చోప్రా
ఈ నెల 29వ తేదీన విడుదల కానున్న ‘జక్కన్న’ చిత్రంలో స్వీట్, ఇన్నోసెంట్ గర్ల్ గా తాను నటించానని హీరోయిన్ మన్నార చోప్రా చెప్పింది. ఒక టీవీ ఛానెల్ లో మాట్లాడుతూ, యువ హీరో సునీల్ సరసన తాను నటించానని, ఈ చిత్రంలో పూర్తి స్థాయి కామెడీ ఉంటుందని, అలాగే యాక్షన్ సన్నివేశాలూ ఉంటాయని చెప్పింది. ఈ చిత్రంలో పాటలు, మ్యూజిక్... టోటల్ గా సినిమా చాలా బాగుంటుందని, ముఖ్యంగా తన డ్యాన్స్ లు, యాక్టింగ్ ఆకట్టుకునేలా ఉంటాయని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని మన్నార చెప్పింది.