: పార్కుల వెంట తిరుగుతూ పరువు తీస్తున్నారని ప్రేమజంటను హత్య చేసిన అమ్మాయి తండ్రి, అన్న
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో మరో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. తన కుమార్తె, మరో యువకుడు కలసి ప్రేమించుకుని, పార్కుల వెంట తిరుగుతూ, పరువు తీస్తున్నారని ఆరోపిస్తూ, తన కుమారుడి సాయంతో వారిద్దరినీ దారుణంగా హత్య చేశాడో తండ్రి. చండీమల్ గ్రామంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, పదహారేళ్ల ఇర్షాద్ అనే బాలిక ఓ యువకుడితో ప్రేమలో పడింది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు నచ్చజెప్పినా ఇర్షాద్ వినలేదు. దీంతో ఇంటి పరువు పోతుందని భావించిన వారు, ఇద్దరినీ దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె తండ్రి ముఖేష్, అన్నయ్య దీపక్ లను అరెస్ట్ చేశారు.