: చైనాలో జాకీచాన్ చిత్రాల కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంటున్న ‘బాహుబలి’


చైనాలో రెండు రోజుల క్రితం విడుదలైన ‘బాహుబలి’ చిత్రం అక్కడి ప్రజలను విపరీతంగా ఆకట్టుకుందట. ఈ నేపథ్యంలో ‘బాహుబలి’ చిత్ర బృందం అక్కడికి వెళ్లింది. ఈ సందర్భంగా చైనా మీడియా వారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడింది. ఈ సమావేశంలో ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. బాహుబలి చిత్రం రీలీజ్ కోసం చైనా ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారని తెలిసింది. అంతర్జాతీయ నటుడు జాకీ చాన్ సినిమా కంటే ‘బాహుబలి’కే ఎక్కువ ఆదరణ లభించిందట. ‘బాహుబలి’ సినిమాకు మొదట్లో 7.1 రేటింగ్ వుండగా, ఇప్పుడది 7.7కు చేరుకోవడం ద్వారా జాకీచాన్ మూవీకన్నా ఎక్కువ క్రేజ్ ను దర్శకుడు రాజమౌళి చిత్రం దక్కించుకుంది.

  • Loading...

More Telugu News