: రెండు మృతదేహాల వెలికితీత... ఫిలింనగర్ భవన శిథిలాల కింద 20 మంది!
హైదరాబాదు ఫిలింనగర్ లో కుప్పకూలిన రెండంతస్తుల నిర్మాణంలో ఉన్న భవంతి శిథిలాల కింద నాలుగు కుటుంబాలకు చెందిన 20 మంది వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. సహాయక చర్యలను ముమ్మరం చేసిన అధికారులు ఇప్పటివరకూ రెండు మృతదేహాలను వెలికితీశారు. భవన నిర్మాణంలో కాంట్రాక్టరు నాసిరకం సిమెంటును వాడటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఘటనతో జూబ్లీహిల్స్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. శిథిలాల కింద ఎవరైనా ప్రాణాలతో ఉండి ఉండవచ్చని, సాధ్యమైనంత త్వరగా కాంక్రీట్ శ్లాబులను పగులగొట్టి మొత్తం శిథిలాలను తొలగిస్తామని మునిసిపల్ అధికారులు చెప్పారు.