: హైదరాబాద్ ఫిలింనగర్ లో కుప్పకూలిన భవనం... శిథిలాల కింద చిక్కుకున్న కూలీలు!
హైదరాబాద్ ఫిలింనగర్ లో కొద్దిసేపటి క్రితం దారుణ ప్రమాదం జరిగింది. కల్చరల్ క్లబ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనం పునాదులతో సహా కుప్పకూలగా, శిథిలాల కింద పలువురు కూలీలు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సహాయ చర్యలను ప్రారంభించారు. కూలిన భవనం శిథిలాలను తొలగించే పనిలో నిమగ్నమై ఉన్నారు. పలు జేసీబీలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఎంతమంది చిక్కుకుపోయి ఉంటారన్న విషయమై సమాచారం లేదు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.