: ఖమ్మం జిల్లాలో రహదారిపై బకెట్ బాంబులు... తప్పిన పెను ప్రమాదం!
మావోయిస్టు ప్రభావం అధికంగా ఉన్న ఖమ్మం జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. వెంకటాపురం మండలంలోని రామచంద్రాపురం రహదారిపై గోతులు తవ్విన మావోయిస్టులు వాటిల్లో బకెట్ బాంబులను అమర్చారు. ఆ మార్గంలో సోదాలు జరుపుతున్న పోలీసు దళాలకు అనుమానం వచ్చి, వాటిని బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ మార్గం గుండా ప్రయాణించే పోలీసు, సైనిక వాహనాల కాన్వాయ్ ని పేల్చి వేయడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేసి వుండవచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం గ్రేహాండ్స్ దళాలు వీటిని నిర్వీర్యం చేసే పనిలో ఉన్నట్టు వివరించారు.