: 22 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెరిగిన కృష్ణమ్మ వరద
కృష్ణానదికి వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో, నిన్న 22 వేల క్యూసెక్కుల నీటిని జూరాల నుంచి శ్రీశైలానికి వదులుతున్న అధికారులు, ఈ ఉదయం దాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచారు. జూరాలకు ఇన్ ఫ్లో 33 వేల క్యూసెక్కులుగా నమోదవుతోందని అధికారులు పేర్కొన్నారు. నిన్న కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో వరద పెరిగిందని, మధ్యాహ్నానికి ఎగువ నుంచి వస్తున్న వరద 50 వేల క్యూసెక్కులను దాటుతుందని భావిస్తున్నామని వివరించారు. కాగా, నిన్నటితో పోలిస్తే, శ్రీశైలం జలాశయం 3 అడుగుల మేర పెరిగింది.