: జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం... వదిలేసి పరారైన మందుబాబులు!


హైదరాబాదులో పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ వైపు వెళుతున్న వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని బీభత్సం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఘటన జరిగింది. పూటుగా మద్యం సేవించిన కొంతమంది యువకులు ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మద్యం మత్తులో అతివేగంగా కారును నడిపి వుండవచ్చని తెలిపారు. ఘటన తరువాత మందుబాబులు కారును నడిరోడ్డుపైనే వదిలి పరారు కాగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. ఈ ఘటన రాత్రి పూట జరగడం, ఆ సమయంలో వాహన సంచారం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.

  • Loading...

More Telugu News