: రైల్లో తనను వేధిస్తున్న బీజేపీ ఎమ్మెల్సీని పట్టించిన యువతి
రైల్లో ప్రయాణిస్తున్న తనను లైంగికంగా వేధిస్తున్న ఓ బీజేపీ ఎమ్మెల్సీని పట్టించిందో యువతి. ఈ ఘటన బీహార్ లో జరిగింది. గోరఖ్ పూర్ వెళుతున్న ఓ రైలులోని ఏసీ కోచ్ లో బాధిత యువతి ప్రయాణిస్తోంది. అదే కోచ్ లో బీజేపీ సివాన్ నియోజకవర్గ ఎమ్మెల్సీ టున్నా పాండే కూడా ప్రయాణిస్తున్నారు. కోచ్ లో ఎవరూ లేకపోవడంతో తన పట్ల ఆయన అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రైలు ప్రయాణిస్తున్న మార్గంలోని హజీపూర్ వద్ద బోగీలోకి వచ్చిన రైల్వే పోలీసులు టున్నా పాండేను అరెస్ట్ చేశారు.