: ఇంటర్ పాస్ కాని యువతి డాక్టరైంది... భార్య బాగోతాన్ని రట్టు చేసిన భర్త!


ఇంటర్మీడియట్ కూడా పాస్ కాని తన భార్య అర్చన, ఫోర్జరీతో డాక్టర్ గా మారి ప్రాక్టీసు చేస్తోందని స్వయంగా ఆమె భర్త మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. తన భార్య 2003లో మరణించిన తమిళరసి అనే యువతి పేరిట మెడికల్ డిగ్రీని పొందిందని ఆమె భర్త కార్తీక్, మామ ఆర్ మనోహర్ లు ఫిర్యాదు చేశారు. ఓ వీఏఓ కుమార్తె అయిన అర్చనా రామచంద్రన్, ఇంటర్ పాస్ కాలేదని, ఆపై మరణించిన తమిళరసి పేరిట మెడికల్ సీటు సంపాదించిందని వారు ఆరోపించారు. దీంతో మెడికల్ రిజిస్టర్ నుంచి తమిళరసి పేరును తొలగించిన తమిళనాడు స్టేట్ మెడికల్ కౌన్సిల్, తదుపరి విచారణ వరకూ ఈ నిర్ణయం అమలులో ఉంటుందని, ఆమె పేరు అర్చనా? లేక తమిళరసా? అని తేల్చాల్సి వుందని తెలిపారు. విషయాన్ని పోలీసులకు సైతం ఫిర్యాదు చేశామని, విచారణలో వారు కూడా భాగమవుతారని కౌన్సిల్ పేర్కొంది. కాగా, భార్యాభర్తల మధ్య వచ్చిన విభేదాల కారణంగానే ఈ బాగోతం బయటపడ్డట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News