: ప్రమాదాలకు నిలయంగా వాయుసేన ఏఎన్-32 విమానాలు!


భారత వాయుసేన నిర్వహిస్తున్న ఏఎన్-32 రవాణా విమానాలు ప్రమాదాలకు గురికావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఈ విమానాలు కూలిపోయాయి. ఉక్రెయిన్ లో తయారైన ఈ విమానాలు మూడు దశాబ్దాల క్రితం నాటివి. దీర్ఘకాలంగా వాడుతూ ఉండటం, ఆధునికీకరణపై దృష్టిని సారించకపోవడమే, తాజా ప్రమాదానికి కారణంగా అధికారులు భావిస్తున్నారు. గతంలో జరిగిన ఏఎన్-32 విమాన ప్రమాదాలను గమనిస్తే, 1986 మార్చి 25న హిందూ మహాసముద్రం మీదుగా ఏడుగురితో వెళుతున్న విమానం గల్లంతు కాగా, నేటికీ దాని జాడ తెలియలేదు. 1990, జూలై 15న తాంబరం నుంచి తిరువనంతపురం బయలుదేరిన మరో విమానం మార్గమధ్యంలో కుప్పకూలింది. 2009లో జూన్ 10న అరుణాచల్ ప్రదేశ్ లో మరో ఏఎన్-32 కూలిపోగా, 13 మంది దుర్మరణం పాలయ్యారు. తాజాగా గత శుక్రవారం గల్లంతైన విమానాన్ని 32 ఏళ్ల క్రితం కొనుగోలు చేయగా, రక్షణ శాఖకు సంబంధించిన యంత్ర పరికరాలు, ఆహారం తీసుకెళుతూ, ఉద్యోగులను పోర్ట్ బ్లెయిర్ లోని వాయుసేన స్థావరంగా ఉన్న ఐఎన్ఎస్ ఉత్క్రోష్ కు ప్రతి రెండు రోజులకూ ఒకసారి చేరుస్తుంటుంది.

  • Loading...

More Telugu News