: శ్రీశైలానికి బిరబిరా పరుగులిడుతున్న కృష్ణమ్మ!


శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ మొదలైంది. ఆల్మట్టి, జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోగా, ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని కిందకు వదులుతుండటంతో, ఆ నీరు శ్రీశైలానికి చేరుతోంది. ఈ ఉదయానికి శ్రీశైలం వద్ద 22 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని అధికారులు వెల్లడించారు. కర్ణాటక ప్రాంతంలో వర్షాలు సంతృప్తికరంగా లేకపోవడంతోనే అధిక వరద లేదని తెలిపారు. మరోవైపు వచ్చే 48 గంటల్లో ఎగువ కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురవవచ్చన్న అధికారుల అంచనాలు కృష్ణా డెల్టా రైతాంగానికి ఆనందం కలిగిస్తున్నాయి. మరో దఫా వర్షాలు కురిస్తే శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద ఖాయమని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News