: ఫ్లెక్సీలు తొలగించాలన్న కేటీఆర్ కు మంచు లక్ష్మి అభినందనలు


సినీ నటి మంచు లక్ష్మి ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ను అభినందించింది. పుట్టిన రోజు, పండగలు అని చెప్పి హైదరాబాదు కూడళ్లను ఫ్లెక్సీలు, హోర్డింగులతో ముంచెత్తవద్దని, ఆఖరుకు ఆ ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులు తన పేరుతో ఏర్పాటు చేసినా సరే వాటిని తొలగించాలని మున్సిపల్ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మంచు లక్ష్మి ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేటీఆర్ లాంటి లీడర్లు ఎంతో మంది అవసరమని ఆమె ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News