: డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఆధార్ కార్డు కూడా వాహనదారుల వెంట ఉండాల్సిందే!: సైబరాబాద్ డీసీపీ


వాహనదారులకు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ కొత్త సూచనలు చేశారు. డ్రంకెన్ డ్రైవ్ ను అడ్డుకునేందుకు, నకిలీ ధ్రువపత్రాలను అరికట్టేందుకు సరికొత్త చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. అందులో భాగంగా నగర వాసులు వాహనాలు నడిపేటప్పుడు తమతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీ బుక్ తో పాటు ఆధార్‌ కార్డు కూడా వెంట ఉంచుకోవాలని ఆయన సూచించారు. లేని పక్షంలో వాహనం సీజ్‌ చేసి, కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News