: ఫ్యాక్షనిజానికి వ్యతిరేకిని... పరిటాల వర్గీయుల హత్యతో నాకు సంబంధం లేదు: ప్రభాకర్ చౌదరి


అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా చాలా కాలంగా పోరాడుతున్నానని టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, మంత్రి పరిటాల సునీత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిలతో తనకు విభేదాలు లేవని అన్నారు. పరిటాల వర్గీయుల జంట హత్యలతో తనకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది కావాలనే తనపై ఆరోపణలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఆయన తెలిపారు. ఫ్యాక్షనిజాన్ని సహించని తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News