: రాజకీయాల్లో చేరిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు జకాటి


రాజకీయాల్లోకి మరో క్రికెటర్ ఎంట్రీ ఇచ్చాడు. మహమ్మద్ అజహరుద్దీన్, నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ, కీర్తీ ఆజాద్, మహ్మద్ కైఫ్, లక్ష్మీరతన్ శుక్లా, శ్రీశాంత్ ల జాబితాలో గోవా క్రికెటర్ షాదబ్ జకాటి కూడా చేరాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన జకాటి గోవా ఫార్వర్డ్ (జీఎఫ్) పార్టీలో చేరాడు. గత జనవరిలో ఏర్పాటైన ఈ ప్రాంతీయ పార్టీలో చేరిన 35 ఏళ్ల జకాటి మాట్లాడుతూ, క్రికెట్ తన జీవితమని అన్నాడు. ఇక ఇప్పుడు రాజకీయాల్లోకి చేరే సమయం వచ్చిందని, గోవాలో బీజేపీని ఎదుర్కొవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపాడు. జకాటిని పార్టీ ఉపయోగించుకుంటుందని పార్టీ అధ్యక్షుడు దుర్గాదాస్ కామత్ తెలిపారు.

  • Loading...

More Telugu News