: క‌శ్మీర్ ప‌ర్య‌ట‌న‌లో రాజ్‌నాథ్ సింగ్‌కి చేదు అనుభ‌వం


ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న‌ క‌శ్మీర్‌లో కేంద్ర‌ హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తన రెండు రోజుల ప‌ర్య‌ట‌నలో భాగంగా ఈరోజు మ‌ధ్యాహ్నం క‌శ్మీర్‌ చేరుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌నకు ఆ రాష్ట్రంలో చేదు అనుభ‌వం ఎదుర‌యింది. స్థానిక వ్యాపారులతో రాజ్‌నాథ్‌ భేటీ కావాలనుకున్నారు. అయితే, స‌మావేశంలో పాల్గొన‌డానికి వ్యాపారులు అంగీకరించలేదు. తాము రాజ్‌నాథ్‌తో మాట్లాడబోమని అధికారులకు స్ప‌ష్టం చేశారు. దీంతో రాజ్‌నాథ్‌సింగ్ ఇక ఆ స‌మావేశాన్ని ర‌ద్దు చేసుకొని మరో కార్యక్రమానికి వెళ్లిపోవల‌సి వ‌చ్చింది. మరోవైపు, త‌న పర్యటనలో భాగంగా క‌శ్మీర్‌ లోయలో ఈరోజు రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతాధికారుల స‌మావేశంలో పాల్గొన్నారు. పారామిలటరీ, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ డీజీలు, ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News