: మ్యూనిక్ హంతకుడు ఐఎస్ఐఎస్ ఉగ్రవాది కాదట!
ప్రపంచం మొత్తం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల హెచ్చరికలతో బెంబేలెత్తుతున్న వేళ...జర్మనీలోని మ్యూనిక్ లోని ఒలింపియా షాషింగ్ కాంప్లెక్స్ లో నరమేధానికి పాల్పడిన దుండగుడికి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధం లేదని భద్రతాధికారులు స్పష్టం చేశారు. ఈ దారుణానికి తెగబడింది ఒక్కడేనని, అతను డిప్రెషన్తో బాధపడేవాడని మ్యూనిక్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. కాగా, సాయుధుడు జరిపిన విచ్చలవిడి కాల్పుల్లో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోగా, దారుణానికి తెగబడ్డ వ్యక్తి కూడా తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. మృతుల్లో ముగ్గురిని కొసావాకు చెందినవారిగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు.