: గత ఏడాది నాటిన మొక్కలేవి?: అధికారులను నిలదీసిన హరీష్ రావు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమం చేపట్టిన వేళ అధికారుల నిర్లక్ష్యంపై రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా పుల్కల్ లో పర్యటించిన మంత్రి సింగూరు జలాశయం వద్ద ఇన్ టేక్ వెల్ పనులు పరిశీలించిన సందర్భంగా పంప్ హౌస్ వద్ద మొక్కలు నాటారు. కాగా, ఇదే ప్రాంతంలో తాను గత ఏడాది నాటిన మొక్కలు ఏవని అధికారులను మంత్రి ప్రశ్నించారు. మంత్రి నిలదీసేసరికి అధికారులను నీళ్లు నమిలారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు.