: చిన్నారుల అక్రమ రవాణా ముఠా అరెస్ట్... ఈస్ట్ కోస్ట్ లో తరలిస్తున్న 73 మంది చిన్నారులను విడిపించిన పోలీసులు
ఈస్ట్‌కోస్ట్ రైలులో ప్రయాణిస్తోన్న 73 మంది చిన్నారులను వరంగల్ రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులు పట్టుకున్నారు. చిన్నారులను అక్రమంగా తరలిస్తున్నారని స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన సమాచారంతో అలర్టయిన పోలీసులు పిల్లల రవాణాను అడ్డుకున్నట్టు సమాచారం. చిన్నారుల గురించి పోలీసులు పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. వారిని మళ్లీ వారి తల్లిదండ్రులు వద్దకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లల రవాణాకు పాల్పడుతోన్న ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పిల్లలను ముఠా రైలు ద్వారా వేర్వేరు ప్రాంతాలకి తరలించే ప్రయత్నం చేసినట్లు సమాచారం.