: వరంగల్ జిల్లా పరకాల ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మృతి.. ఆందోళనకు దిగిన బంధువులు
వరంగల్ జిల్లా పరకాల ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఈరోజు విషాద ఘటన చోటుచేసుకుంది. కాన్పు కోసం ఆసుపత్రిలో చేరిన ఓ మహిళకు ఈరోజు నొప్పులు వచ్చాయి. ప్రసవం చేయడానికి ఆసుపత్రిలో వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో ఓ నర్సు అందుకు పూనుకుంది. అయితే, ప్రసవానంతరం శిశువు మృతి చెందింది. దీని పట్ల ఆ శిశువు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయాన్ని తెలుసుకున్న బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఆసుపత్రి వైద్యులు గర్భిణీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.