: బంగారం దిగుమతి విలువ పెంచిన కేంద్రం
దిగుమతి చేసుకునే బంగారం విలువ (కొనుగోలు ధరతో సంబంధం లేదు)ను కేంద్ర ప్రభుత్వం పెంచింది. 10 గ్రాముల బంగారం బేస్ ధర 472 డాలర్లు(రూ.25488)గా నిర్ణయించింది. అంటే ఈ ధర ఆధారంగానే ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 10 గ్రాముల బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని వసూలు చేస్తుంది. వాస్తవానికి పది రోజుల క్రితమే 10 గ్రాములకు బేస్ ధరను 449 డాలర్లకు తగ్గించిన ప్రభుత్వం అంతర్జాతీయంగా రేట్లలో హెచ్చుతగ్గులున్నందున మళ్లీ పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. వెండి దిగుమతి విలువలో ఎలాంటి మార్పూ చేయలేదు. ఇది ప్రస్తుతం కేజీకి 762 డాలర్లుగా ఉంది.