: థానేలో మరో ఐఎస్ ముష్కరుడి అరెస్ట్!


దేశంలో ఐఎస్ ముష్కరులు మరింతగా విస్తరిస్తున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాదులోని పాతబస్తీని షెల్టర్ జోన్ గా చేసుకుని పెను విధ్వంసానికి కుట్ర పన్నిన ఏడుగురు ఐఎస్ అనుమానిత ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలోని థానే జిల్లాను జల్లెడ పట్టిన కేరళ పోలీసులు, మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం కలసి మరో ఐఎస్ అనుమానిత ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. సిరియాలోని ఐఎస్ ముష్కర దళాల్లో పనిచేస్తున్న వాంటెడ్ క్రిమినల్ ఫరూక్ తో టచ్ లో ఉన్నాడన్న ఆరోపణలతో మహారాష్ట్రలోని పర్భణి జిల్లాకు చెందిన ఈ వ్యక్తిని అరెస్ట్ చేశారు. దీంతో భారత్ లో పెను విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్ ముష్కరులు భారీ ప్రణాళికలే రచించారన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News