: ఏపీ డీజీపీగా నండూరి సాంబశివరావు!...బెజవాడలో ఇన్ చార్జీ డీజీపీగా బాధ్యతల స్వీకరణ!
ఏపీ కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, నిన్నటిదాకా ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించిన నండూరి సాంబశివరావు ఇకపై ఏపీ డీజీపీగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు మొన్న రాత్రే ఆయనను ఇన్ చార్జీ డీజీపీగా నియమిస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. కొద్దిసేపటి క్రితం విజయవాడలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో పదవీ విరమణ చేసిన జేవీ రాముడికి పోలీసు పటాలాలు గౌరవంగా వీడ్కోలు పలికాయి. ఆ కార్యక్రమం తర్వాత విజయవాడలోనే సాంబశివరావు ఇన్ చార్జీ డీజీపీగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.