: తాంబరం ఎయిర్ బేస్ లో పారికర్!... గల్లంతైన విమానం గాలింపు చర్యలపై స్వీయ పర్యవేక్షణ!


కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కొద్దిసేపటి క్రితం చెన్నయ్ లోని తాంబరం ఎయిర్ బేస్ లో ల్యాండయ్యారు. నిన్న చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం కనిపించకుండాపోయిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో భారత వైమానిక దళానికి చెందిన 29 మంది అధికారులున్నారు. వీరిలో విశాఖకు చెందిన 8 మంది తెలుగు వారు కూడా ఉన్నారు. 24 గంటలు దాటిపోయినా విమానం ఆచూకీ లభించని నేపథ్యంలో మరింత ముమ్మరంగా గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గాలింపు చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు నేరుగా రంగంలోకి దిగిన పారికర్ నేటి ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి కొద్దిసేపటి క్రితం తాంబరంలో దిగారు. అదృశ్యమైన విమానం ఆచూకీ కోసం జరిగిన గాలింపు చర్యలపై ఆరా తీసిన ఆయన మరింత ముమ్మర గాలింపు చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. గాలింపు చర్యలను పారికర్ తాంబరంలోనే ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News