: షీలా యూపీ ఎన్నికల ప్రచారం షురూ!... జెండా ఊపి సాగనంపిన సోనియా, రాహుల్ గాంధీ!


వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ అప్పుడే శ్రీకారం చుట్టింది. నేటి ఉదయం యూపీ సీఎం అభ్యర్థిగా ఆ పార్టీ ఖరారు చేసిన ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ బస్సులో ఢిల్లీ నుంచి యూపీకి బయలుదేరారు. ఈ బస్సుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ బస్సు యాత్రలో షీలాతో పాటు పార్టీ యూపీ చీఫ్ రాజ్ బబ్బర్ కూడా పాలుపంచుకోనున్నారు.

  • Loading...

More Telugu News