: శాండల్‌వుడ్‌లో సంచలనం.. మొట్టమొదటి సారి సినిమా ట్రయిలర్ విడుదల చేసిన ప్రధాని మోదీ
శాండల్‌వుడ్‌లో సంచలనం జరిగింది. ఓ కన్నడ సినిమా ట్రయిలర్‌ను తొలిసారిగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విడుదల చేయడం సినీ అభిమానుల్లో ఆసక్తిని కలిగించింది. ‘22 జూలై 1947’ అనే శాండల్‌వుడ్ మూవీ ట్రయిలర్‌ను ప్రధాని తన ఆఫీస్‌లో రిలీజ్ చేశారు. మాతృదేశంపై ప్రేమ, భక్తిని పెంచేలా సినిమా కథాంశం ఉంటుందని ఈ సినిమా దర్శకుడు విశాల్‌రాజ్, నిర్మాత సంజేగౌడలు మీడియాకు తెలిపారు. అందుకే మోదీ తమ సినిమా ట్రయిలర్‌ను విడుదల చేయడానికి ఒప్పుకున్నారని, ప్రధాని మూవీ ట్రయిలర్‌ని విడుదల చేయడం తమ సినీ రంగానికే గర్వకారణమని వారు పేర్కొన్నారు. తమ సినిమా ట్రయిలర్ మోదీ చేతుల మీదుగా విడుదల కావడానికి కేంద్ర ఆర్థిక వాణిజ్య శాఖ మంత్రి అరుణజైట్లీ, ఎంపీ సురేశ్ లు సాయం చేశారని ఈ చిత్రం దర్శకుడు చెప్పారు. ‘22 జూలై 1947’ చిత్రంలో సుచేంద్ర ప్రసాద్, అచ్యుత్‌కుమార్, సీనియర్ నటి సుధారాణి, నంజేగౌడ తదితరులు నటించారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ తదితర భాషలల్లోనూ ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నారు.