: లీలాకుమార్ జేబులో చిల్లిగవ్వ లేదు!... కళానికేతన్ ఆస్తులన్నీ తనఖాలో!: డైలమాలో పోలీసులు


అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత కార్మికులనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు చెందిన నేత కార్మికులను నిండా ముంచి అరెస్టైన కళానికేతన్ ఎండీ లీలాకుమార్ విచారణలో భాగంగా పలు సంచలన విషయాలు చెప్పారట. కోట్లాది రూపాయల విలువ చేసే చేనేత వస్త్రాలను నేత కార్మికుల నుంచి సేకరించిన లీలాకుమార్... డబ్బు చెల్లింపులో మాత్రం ఆసక్తి చూపలేదు. దీంతో ధర్మవరం చేనేత కార్మికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు లీలా కుమార్ తో పాటు ఆయన సతీమణి, సంస్థ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న లక్ష్మీశారదను కూడా అరెస్ట్ చేశారు. లక్ష్మీశారదకు నిన్న బెయిల్ లభించగా, లీలాకుమార్ మాత్రం పోలీసు కస్టడీలో ఉన్నారు. కంపెనీ వాస్తవ స్థితిగతుల గుట్టు విప్పేందుకు కోర్టు అనుమతితో లీలాకుమార్ ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. విచారణలో భాగంగా నేత కార్మికుల బకాయిలు చెల్లించే ఆర్థిక స్తోమత తనకు లేదని లీలాకుమార్ చెప్పారట. ప్రస్తుతం తన వద్ద చిల్లిగవ్వ కూడా లేదని ఆయన చెప్పడంతో మరి ఆస్తుల మాటేమిటని పోలీసులు ప్రశ్నించారు. దీనిపై లీలాకుమార్ నీళ్లు నమలగా... పోలీసులే వాటి వివరాలను శోధించి షాక్ తిన్నారట. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వున్న కళానికేతన్ షోరూంలతో పాటు ఆ సంస్థ స్థిరాస్తులన్నీ తనఖాలోనే ఉన్నాయట. దీంతో ఏం చేయాలో పాలుపోక పోలీసులు తలలు పట్టుకున్నారట.

  • Loading...

More Telugu News