: హైదరాబాదులో నారా లోకేశ్!... టీ టీడీపీ నేతలతో కీలక భేటీ!
టీడీపీ యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిన్న రాత్రే హైదరాబాదు చేరుకున్నారు. టీ టీడీపీ నేతలకు ఇచ్చిన హామీ మేరకు నేటి ఉదయం ఆయన నేరుగా పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న టీ టీడీపీ కీలక నేతలు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో పార్టీ జిల్లా ఇన్ చార్జీలు, మండల ఇన్ చార్జీలతో పాటు అనుబంధ సంఘాలకు చెందిన రాష్ట్ర స్థాయి నేతలు పాలుపంచుకున్నారు. తెలంగాణలో పార్టీని పురోభివృద్ధి బాటలో నడిపేందుకు ఏమేం చర్యలు చేపట్టాలన్న అంశంపై భేటీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.