: కొత్త మోడల్ కారును శ్రీవారికి విరాళంగా అందించిన మహేంద్ర కంపెనీ
ఆటోమొబైల్ రంగంలో పేరెన్నికగన్న మహేంద్ర కంపెనీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడికి ఈరోజు ఉదయం కారుని విరాళంగా అందించింది. తమ కంపెనీ నూతనంగా రూపొందించిన కొత్తమోడల్ కారును ఈరోజు తిరుమలకు తీసుకువచ్చిన ఆ కంపెనీ ప్రతినిధులు ఆ కారుకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత టీటీడీ డిప్యూటీ ఈవో కోదండరామారావుకు ఆ కారుని అందించి, దానికి సంబంధించిన పత్రాలను ఇచ్చారు. కారుని తిరుమల తిరుపతి దేవస్థాన అవసరాల కోసం ఉపయోగించనున్నారు.