: విశాఖలో చంద్రబాబు... ఎయిర్ ఫోర్స్ విమాన గల్లంతు బాధితుల కుటుంబాలకు పరామర్శ


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం విశాఖపట్నంలో ల్యాండయ్యారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన చంద్రబాబు... నిన్న తూర్పు తీరంలో గల్లంతైన ఎయిర్ ఫోర్స్ విమానం ఘటన నేపథ్యంలో తన పర్యటనను స్వల్పంగా మార్చుకున్నారు. గల్లంతైన విమానంలో 8 మంది విశాఖ వాసులున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖలో అడుగుపెట్టిన వెంటనే నేరుగా గల్లంతైన వారి కుటుంబాల వద్దకు వెళ్లిన చంద్రబాబు... వారికి ధైర్యం చెప్పారు. భయపడాల్సిన అవసరం లేదని, ఏం జరిగినా అండగా నిలుస్తామని ఆయన బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు.

  • Loading...

More Telugu News