: షాపింగ్ మాల్లో దాడి హేయమైన చర్య: ప్రధాని మోదీ
జర్మనీలోని మ్యూనిక్ నగరంలోని ఒలంపియా షాపింగ్మాల్లో దుండగుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. కాల్పుల్లో 9 మంది మృతి చెందగా, 16 మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాల్పుల తరువాత 18 ఏళ్ల ఆ దుండగుడు తనను తాను కాల్చుకొని మృతి చెందాడు. కలకలం రేపిన ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఈ దాడి హేయమైన చర్య అని అన్నారు. గాయాలపాలయిన 16 మంది పౌరులు త్వరగా కోలుకోవాలని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. మోదీ సహా వివిధ దేశాల నేతలు ఈ దాడిని ఖండిస్తూ ట్వీట్లు చేశారు.