: తెలంగాణకి భారీ వర్ష సూచన.. ఏపీలో పలుచోట్ల వర్షాలు


తెలంగాణలో ఈరోజు, రేపు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని విశాఖ వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లుచోట్ల ఓ మోస్తరు వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని వారు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, ఛత్తీస్గఢ్ నుంచి తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయ‌ని పేర్కొన్నారు. వీటి ప్ర‌భావంతోనే తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపారు.

  • Loading...

More Telugu News